Suryapet: మహా చండీ దేవిగా సూర్యాపేట సంతోషి మాత దర్శనం!
Suryapet: సూర్యాపేట శ్రీ సంతోషి మాత దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ మహా చండీ దేవిగా దర్శనమిచ్చారు.
Suryapet: మహా చండీ దేవిగా సూర్యాపేట సంతోషి మాత దర్శనం!
సూర్యాపేట: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషి మాత దేవాలయంలో అమ్మవారు శ్రీ మహా చండీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో చండీ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భవాని దీక్షాధారణ భక్తులకు పూజలతో పాటు చండీ హోమం, రుద్ర హోమం నిర్వహించారు. తెల్లవారుజామున అమ్మవారి సన్నిధిలో గల శ్రీ చక్ర యంత్రానికి ప్రత్యేక పూజలు చేశారు.
శ్రీ చండీ మాత అలంకారంలో భక్తులకు సామూహికంగా కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. నవరాత్రుల్లో భాగంగా బ్రాహ్మణ ముత్తైదువకు సుహాసిని పూజ, శివలింగాకృతిలో దీపోత్సవం నిర్వహించారు. మహిళలు సామూహికంగా సౌందర్యలహరి, శివానందలహరి పారాయణం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు బ్రాహ్మణపల్లి మురళీధర్, ప్రధాన కార్యదర్శి పబ్బ ప్రకాశ్ రావు, కోశాధికారి కొత్త మల్లికార్జున్, కన్వీనర్ నరేంద్రుని విద్యాసాగర్ రావు, ఉపాధ్యక్షులు బేలిదే అశోక్, ఉత్సవ నిర్వాహకులు గోపారపు రాజు, సహాయ కార్యదర్శి దేవరశెట్టి సోమయ్య, సభ్యులు బ్రాహ్మణపల్లి మనోహర్ గుప్త, మహంకాళి ఉపేందర్, కక్కిరేణి పద్మ, తెడ్ల పల్లవి, అలంకరణ భక్తులు కక్కిరేణి మురళీకృష్ణ, ప్రొద్దుటూరి నాగప్రసాద్, భక్తులు తెడ్ల ప్రభాకర్, బ్రాహ్మణపల్లి నాగమణి, ఓరుగంటి కనకరత్నం, విజయలక్ష్మి, కవిత, రమాదేవి, అర్చకులు అశోక్ మిశ్రా, రాఘవాచార్యులు, ఆలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.




