Suryapet: మద్దిరాల ముకుందాపురంలో అధికారుల ఆకస్మిక ఇసుక తనిఖీలు!
Suryapet: సూర్యాపేట జిల్లా ముకుందాపురంలో అధికారుల ఆకస్మిక తనిఖీలు. అక్రమంగా నిల్వ ఉంచిన 30 ట్రాక్టర్ల ఇసుక స్వాధీనం.
Suryapet: మద్దిరాల ముకుందాపురంలో అధికారుల ఆకస్మిక ఇసుక తనిఖీలు!
Suryapet: సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలోని ముకుందాపురం గ్రామంలో అక్రమ ఇసుక నిల్వలపై రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మద్దిరాల మండల తహసీల్దార్ పోలీసులతో కలిసి గ్రామంలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు.
ఈ తనిఖీల్లో నివాస గృహాల ప్రాంగణాల్లో సుమారు 30 ట్రాక్టర్లకు సరిపడా ఇసుకను అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించారు. దీంతో అధికారులు ఆ ఇసుక డంపులను స్వాధీనం చేసుకున్నారు. మండలంలో అక్రమ ఇసుక నిల్వలు, రవాణాపై నిఘా కొనసాగిస్తున్నామని, తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయని తహసీల్దార్ తెలిపారు.




