Suryapet: సూర్యాపేట జిల్లాలో మురసు తుఫాన్ అలర్ట్ బడులకు సెలవు!
Suryapet: సూర్యాపేటలో మురసు తుఫాన్ హెచ్చరికలతో బడులు, అంగన్‌వాడీలకు సెలవు ప్రకటించిన కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.
Suryapet: సూర్యాపేట జిల్లాలో మురసు తుఫాన్ అలర్ట్ బడులకు సెలవు!
సూర్యాపేట: మురసు తుఫాన్ కారణంగా ఈరోజు మధ్యాహ్నం నుండి తీవ్ర వర్షాలు, గాలులు వీచే ప్రమాదం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో సూర్యాపేట జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.
జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశాల ప్రకారం జిల్లాలోని అన్ని స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలకు ఈరోజు మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు సెలవు ప్రకటించారు. రేపటి సెలవు విషయంపై సాయంత్రం నిర్ణయం తెలియజేస్తామని అధికారులు పేర్కొన్నారు.
మధ్యాహ్నం నుండి తీవ్ర గాలులు, వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తగు జాగ్రత్తలు పాటించాలని జిల్లా యంత్రాంగం సూచించింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
పంచాయతీ కార్యదర్శులు, జీపీఓలు గ్రామాల్లో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ సమాచారం అందించాలని, పోలీస్, రెవెన్యూ సహా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు సమాచారాన్ని మండల, జిల్లా కేంద్రాలకు చేరవేయాలని ఆదేశించారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు.




