Suryapet: సూర్యాపేటలో ఘనంగా పెరిక కుల బంధువుల ఆత్మీయ సమ్మేళనం!

Suryapet: సూర్యాపేట మానస నగర్, అంజనపురి కాలనీలలో పెరిక కుల బంధువుల ఆత్మీయ సమ్మేళనం. హాజరైన జిల్లా అధ్యక్షులు బందు శ్రీధర్ బాబు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 28 Oct 2026 7:15 PM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేటలో ఘనంగా పెరిక కుల బంధువుల ఆత్మీయ సమ్మేళనం!

Suryapet: సూర్యాపేట పట్టణంలోని మానస నగర్, అంజనపురి కాలనీలలో నివాసం ఉంటున్న పెరిక కుల బంధువుల ఆత్మీయ సమ్మేళనం జిల్లా సంఘం ఉపాధ్యక్షులు రాందేని ఆదినారాయణ అధ్యక్షతన వారి నివాసంలో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా పెరిక కుల సంఘం అధ్యక్షులు బందు శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమ్మేళనంలో రెండు కాలనీలకు చెందిన పెరిక కుల బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని పరస్పరం పరిచయాలు చేసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బందు శ్రీధర్ బాబు మాట్లాడుతూ, గత సంవత్సర కాలంగా జిల్లా సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ సామాజిక, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. సూర్యాపేటలో పెరిక కుల బంధువుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచేలా పెరిక భవనాన్ని నిర్మించుకోవడానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఇటీవల మిర్యాలగూడలో పెరిక భవన ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన విషయాన్ని గుర్తుచేస్తూ, అదే స్ఫూర్తితో సూర్యాపేటలో కూడా త్వరలోనే పెరిక భవన నిర్మాణాన్ని సాకారం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అలాగే ఇటీవల ఏర్పాటు చేసిన ట్రస్టు ఆవశ్యకతను వివరిస్తూ, ప్రతి ఒక్కరూ ట్రస్టు సభ్యులుగా చేరి సంఘ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని చక్కగా ఏర్పాటు చేసిన ఉపాధ్యక్షులు రాందేని ఆదినారాయణకు కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు.

జిల్లా అసోసియేట్ అధ్యక్షులు దొంగరి నాగేశ్వరరావు ట్రస్టు ఆవశ్యకతను వివరించారు. పట్టణ గౌరవాధ్యక్షుడు బంధు వీరయ్య, జిల్లా నాయకులు తొగరు మల్లికార్జున్, నెమ్మని నాగేశ్వరరావు, సంధ్యాల వినోద్, ఎర్రంశెట్టి ఉపేందర్ తదితరులు మాట్లాడుతూ మనమంతా ఐకమత్యంగా ఉండి సూర్యాపేటలో భవన నిర్మాణ కలను సాకారం చేసుకోవాలని కోరారు.

అనంతరం రెండు కాలనీలకు చెందిన పెరిక కుల బంధువులు ఆదినారాయణ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు బందు శ్రీధర్ బాబును ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో పనాస నాగేశ్వరరావు, వెంబడి మురళి, తిప్పని సైదారావు, బరిశెట్టి శ్రీనివాస్, దొంగరి నరసింహారావు, రామినేని నాగరాజు, కైగూరి రమేష్, ముత్తినేని నర్సయ్య, బొలిశెట్టి నరేష్, ముత్తినేని జానకి రాములు, నీలం మల్లికార్జున్, వడ్డే సుదర్శన్, పోకల ఉదయ్ కుమార్, కటకం ప్రవీణ్, గన్నా లక్ష్మీకాంత్ వర్మ, పోకల విక్రం తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA