Suryapet: పెద్దగట్టు లింగమంతుల స్వామిని దర్శించుకున్న యాదవ యువత!
Suryapet: సూర్యాపేట జిల్లా పెద్దగట్టు లింగమంతుల స్వామిని గోరెంట్ల యాదవ యువకులు దర్శించుకున్నారు. ఫిబ్రవరిలో జరిగే జాతరకు ప్రభుత్వం అధిక నిధులు మంజూరు చేయాలని కోరారు.
Suryapet: పెద్దగట్టు లింగమంతుల స్వామిని దర్శించుకున్న యాదవ యువత!
సూర్యాపేట జిల్లా: తెలంగాణలో రెండవ అతిపెద్ద జాతరగా పేరుగాంచిన శ్రీ పెద్దగట్టు లింగమంతుల స్వామి వారిని తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం గోరెంట్ల గ్రామానికి చెందిన యాదవ యువనాయకులు ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ కార్యక్రమంలో కలంచర్ల వెంకన్న యాదవ్ మాట్లాడుతూ.. వచ్చే ఫిబ్రవరి నెలలో నిర్వహించనున్న శ్రీ పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు మంజూరు చేయాలని కోరారు. జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో గుండాల నాగలింగం, రమేష్, శ్రీను, లింగయ్య, సౌనయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు.




