Suryapet: జవహర్లాల్ లిఫ్ట్ పనులను పరిశీలించిన మంత్రి ఉత్తమ్!
Suryapet: పాలకవీడు మండలం జాన్‌పహాడ్‌లో జవహర్లాల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
Suryapet: జవహర్లాల్ లిఫ్ట్ పనులను పరిశీలించిన మంత్రి ఉత్తమ్!
సూర్యాపేట: పాలకవీడు మండలం జాన్‌పహాడ్‌లో జరుగుతున్న జవహర్లాల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను, హుజూర్‌నగర్‌లో ఆర్ ఆర్ అండ్ బి నీటిపారుదల నిర్మాణంలో ఉన్న బిల్డింగులను పనులను రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జవహర్లాల్ లిఫ్ట్ ద్వారా సుమారు 15 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో ఎలాంటి జాప్యం చేయకుండా వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
మరోసారి పనుల పరిశీలనకు రావాల్సిన అవసరం లేకుండా పనులు పూర్తి చేయాలని, తిరిగి వస్తే లిఫ్ట్ ప్రారంభోత్సవానికే వస్తానని మంత్రి అధికారులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ.90 వేల కోట్లు జమ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.




