Suryapet: జాతీయ క్రికెట్ పోటీలకు ఎంపికైన సూర్యాపేట క్రీడాకారిణి!
Suryapet: జాతీయ క్రికెట్ పోటీలకు ఎంపికైన సూర్యాపేటకు చెందిన యువ క్రీడాకారిణి మనిమద్ది పల్లవిని బీసీ ఉద్యమ నేత వట్టే జానయ్య యాదవ్ ఘనంగా సన్మానించి ఆర్థిక సాయం అందించారు.
Suryapet: జాతీయ క్రికెట్ పోటీలకు ఎంపికైన సూర్యాపేట క్రీడాకారిణి!
సూర్యాపేట: జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైన యాదవ సామాజిక వర్గానికి చెందిన క్రీడాకారిణి మనిమద్ది పల్లవిని బీసీ ఉద్యమ నేత వట్టే జానయ్య యాదవ్ ఘనంగా సన్మానించి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా పల్లవి సాధించిన విజయాన్ని అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. క్రీడారంగంలో ప్రతిభ కలిగిన యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పల్లవి తల్లిదండ్రులు మనిమద్ది రామకృష్ణ, రమాదేవి, శ్రీ కృష్ణ యాదవ సంఘ్ ట్రస్ట్ చైర్మన్ ఊర గాయత్రి రామ్మూర్తి యాదవ్, వ్యవస్థాపక సభ్యులు పోలేబోయిన నరసయ్య యాదవ్, సుంకరబోయిన శ్రీనివాస్ యాదవ్, ట్రెజరర్ మర్యాద సైదులు యాదవ్, కంచుగట్ల జానయ్య యాదవ్, సుంకరబోయిన రాజు యాదవ్, ఆవుదొడ్డి శ్రీకాంత్ యాదవ్, ఉద్యోగ సంఘాల నాయకులు, యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.




