Suryapet: రాష్ట్రస్థాయి సంగీత పోటీల్లో సూర్యాపేట ఉద్యోగిని స్వేచ్ఛకు మొదటి బహుమతి!

Suryapet: ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పోటీల్లో సూర్యాపేట మున్సిపాలిటీ ఉద్యోగిని పెండ్లి స్వేచ్ఛకు ప్రథమ బహుమతి. కమిషనర్, చైర్‌పర్సన్ ప్రత్యేక అభినందనలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 10 Nov 2026 8:08 AM IST
Suryapet
X

Suryapet: రాష్ట్రస్థాయి సంగీత పోటీల్లో సూర్యాపేట ఉద్యోగిని స్వేచ్ఛకు మొదటి బహుమతి!

Suryapet: సూర్యాపేట విధి నిర్వహణతో పాటు కళారంగంలోనూ తన ప్రతిభను చాటుతూ సూర్యాపేట మున్సిపాలిటీకి చెందిన ఉద్యోగిని పెండ్లి స్వేచ్ఛ రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి సాధించి పట్టణానికి గర్వకారణంగా నిలిచారు.

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ కల్చరల్ కాంపిటీషన్స్‌లో భాగంగా తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 30న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన వెస్ట్రన్ వోకల్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొన్న పెండ్లి స్వేచ్ఛ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయం కల్చరల్ సెక్రటరీ యామిని కనకతార చేతుల మీదుగా పెండ్లి స్వేచ్ఛ ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ పరిధిలోని సూర్యాపేట మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న స్వేచ్ఛ ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే సంగీత రంగంలోనూ తన ప్రతిభను నిరూపించుకోవడం విశేషం. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమ బహుమతి సాధించడం సూర్యాపేట మున్సిపాలిటీకి గర్వకారణంగా నిలిచింది.

ఈ సందర్భంగా సూర్యాపేట మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, మున్సిపల్ కమిషనర్ సి.హెచ్. హన్మంత్ రెడ్డి పెండ్లి స్వేచ్ఛను ప్రత్యేకంగా అభినందించారు. విధి నిర్వహణతో పాటు కళారంగంలోనూ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించి సూర్యాపేట మున్సిపాలిటీకి, తెలంగాణ రాష్ట్రానికి మరింత మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది సైతం స్వేచ్ఛను అభినందించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్