Suryapet: మన అమ్మ హాస్పిటల్‌లో అత్యాధునిక రోబోటిక్ కీళ్ల మార్పిడి సేవలు ప్రారంభం!

Suryapet: సూర్యాపేటలోని మన అమ్మ హాస్పిటల్‌లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే తొలిసారిగా రోబోటిక్ కీళ్ల మార్పిడి సేవలను డా. రామకృష్ణ, డా. విజయలక్ష్మి ప్రారంభించారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 15 Oct 2026 8:03 PM IST
Suryapet
X

Suryapet: మన అమ్మ హాస్పిటల్‌లో అత్యాధునిక రోబోటిక్ కీళ్ల మార్పిడి సేవలు ప్రారంభం!

సూర్యాపేట: ఉమ్మడి నల్గొండ జిల్లా వైద్యరంగంలో మరో ముందడుగు పడింది. సూర్యాపేటలోని మన అమ్మ హాస్పిటల్‌లో అత్యాధునిక రోబోటిక్ కీళ్ల మార్పిడి వ్యవస్థను బుధవారం ప్రారంభించారు.

ఉమ్మడి జిల్లాలో తొలిసారిగా రోబోటిక్ సాంకేతికతతో కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ వ్యవస్థను డా. రామకృష్ణ, డా. విజయలక్ష్మి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆసుపత్రి అధినేతలు డా. సుధీర్ కుమార్, డా. స్వరూప లక్ష్మి మాట్లాడుతూ ఆధునిక వైద్య సాంకేతికతను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. రోబోటిక్ సాంకేతికతతో కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సల్లో మరింత ఖచ్చితత్వం సాధించవచ్చని, రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డా. రంగారెడ్డి, ఐఎంఏ అధ్యక్షుడు డా. రమేష్, డా. రామ్మూర్తి, డా. చంద్రశేఖర్, బంధు వీరయ్య, బంధు శ్రీధర్, తొగరు మల్లికార్జున, ఇజ్రాయిల్ తదితరులు, వివిధ సంఘాల సభ్యులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA