Maddirala: సైబర్ మోసాలు, రోడ్డు భద్రతపై ఎస్‌ఐ వీరన్న అవగాహన!
Maddirala: సూర్యాపేట జిల్లా మద్దిరాల ఎక్స్ రోడ్డు వద్ద ఎస్‌ఐ వీరన్న ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
Maddirala: సైబర్ మోసాలు, రోడ్డు భద్రతపై ఎస్‌ఐ వీరన్న అవగాహన!
మద్దిరాల: సూర్యాపేట జిల్లా.. తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రంలోని ఎక్స్ రోడ్ వద్ద ఎస్‌ఐ వీరన్న ఆధ్వర్యంలో మద్దిరాల పోలీస్ స్టేషన్ సిబ్బంది సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్ ఆర్థిక మోసాలు, ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా జరిగే మోసాలు, రహదారి భద్రత, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలు, మైనర్ల డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు వివరించారు.
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయవద్దని, ఆన్‌లైన్ లావాదేవీల సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మద్దిరాల ఎస్‌ఐ వీరన్నతో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.




