Kodad: చిరు వ్యాపారులపై కోదాడ ట్రాఫిక్ పోలీసుల మానవతా దృక్పథం!

Kodad: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ, చిరు వ్యాపారుల జీవనోపాధికి భంగం కలగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 28 Nov 2026 11:57 AM IST
Kodad
X

Kodad: చిరు వ్యాపారులపై కోదాడ ట్రాఫిక్ పోలీసుల మానవతా దృక్పథం!

కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు మానవతా దృక్పథంతో వ్యవహరించారు. చిరు వ్యాపారుల జీవనోపాధికి ఎలాంటి భంగం కలగకుండానే, పట్టణంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కోదాడలోని రామాలయం వీధి, పరిసర ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చి మట్టి పాత్రలు అమ్ముకుంటున్న చిరు వ్యాపారులతో ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి స్వయంగా మాట్లాడారు. వాహనదారులకు, పాదచారులకు ఇబ్బందులు కలగకుండా వ్యాపార సామగ్రిని ఒక క్రమపద్ధతిలో సర్దుకోవాలని వారికి అవగాహన కల్పించారు.​

అయితే, ఈ వెసులుబాటు అన్ని వేళలా ఉండదని పోలీసులు స్పష్టం చేశారు. రహదారులను ఆక్రమించి ట్రాఫిక్ సమస్యలకు కారణమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మున్సిపల్ అధికారుల సమన్వయంతో పట్టణంలో ‘ఆపరేషన్ రోప్’ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేస్తామని ఎస్ఐ అంజిరెడ్డి తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణకు వ్యాపారులంతా సహకరించాలని కోదాడ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET