Kodad: కోదాడలో భారీ చోరీ.. రూ.13 లక్షల విలువైన సొత్తు అపహరణ!
Kodad: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని బంగారు షాప్ బజార్‌లో ఉన్న భ్రమరాంబ జ్యువెలరీస్ వర్క్‌షాప్‌లో దుండగులు పైకప్పు కత్తిరించి రూ.13 లక్షల విలువైన సొత్తును అపహరించారు.
Kodad: కోదాడలో భారీ చోరీ.. రూ.13 లక్షల విలువైన సొత్తు అపహరణ!
కోదాడ: పట్టణంలో భారీ చోరీ ఘటన కలకలం రేపింది. పట్టణంలోని 24వ వార్డు బంగారు షాప్ బజార్‌లో ఉన్న బ్రమరాంబ జ్యువెలరీస్ వర్క్‌షాప్‌ను దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. వర్క్‌షాప్ పైకప్పును కత్తిరించి లోపలికి ప్రవేశించిన దుండగులు సుమారు ఐదు కేజీల వెండి, మూడు తులాలకు పైగా బంగారం, రూ.27 వేల నగదును అపహరించారు.
అంతేకాకుండా అక్కడ ఉన్న సీసీ కెమెరాను సైతం ఎత్తుకెళ్లారు. చోరీకి గురైన సొత్తు విలువ సుమారు రూ.13 లక్షలు ఉంటుందని యజమాని బొద్దోజు మల్లికార్జున చారి తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సై మల్సూర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పట్టణంలోని ప్రధాన వ్యాపార ప్రాంతంలో జరిగిన ఈ చోరీతో స్థానికంగా కలకలం రేగింది.




