Suryapet: శమీ పూజ వేడుకలకు మున్సిపల్ కమిషనర్కు ఆహ్వానం!
Suryapet: సూర్యాపేట జమ్మిగడ్డలో విజయదశమి సందర్భంగా జరిగే శమీ పూజ వేడుకలకు రావాలని మున్సిపల్ కమిషనర్ సి.హెచ్. హనుమంత రెడ్డికి సంతోషి మాత ఆలయ కమిటీ ఆహ్వానం పలికింది.
Suryapet: శమీ పూజ వేడుకలకు మున్సిపల్ కమిషనర్కు ఆహ్వానం!
సూర్యాపేట: ఈ నెల 20వ తేదీ మంగళవారం విజయదశమి సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని జమ్మిగడ్డలో గల జిల్లా పరిషత్ కార్యాలయంలో సూర్యాపేట మున్సిపాలిటీ సహకారంతో శ్రీ సంతోషి మాత దేవాలయం ఆధ్వర్యంలో జరిగే శమీ పూజ కార్యక్రమానికి రావాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ కు ఆహ్వానం అందజేశారు.
బుధవారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ సి.హెచ్. హనుమంత రెడ్డిని కలిసి సంతోషి మాత దేవాలయ అధ్యక్షులు బ్రాహ్మణపల్లి మురళీధర్, ఉత్సవ నిర్వాహకులు గోపారపు రాజు, ఉపాధ్యక్షులు బెలిదే అశోక్, సభ్యులు బ్రాహ్మణపల్లి మనోహర్, దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది గౌసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.




