Jajireddygudem: జాజిరెడ్డిగూడెంలో కళాకారులకు ఘనంగా డప్పుల పంపిణీ!

Jajireddygudem: సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలో దాత మరిపెద్ది శ్రీనివాస్ గౌడ్ సమకూర్చిన డప్పులను బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుండగాని సోమేష్ గౌడ్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.

Muragundla, Veeraiah, Tungathurthy
Published on: 24 Oct 2026 7:19 PM IST
Jajireddygudem
X

Jajireddygudem: జాజిరెడ్డిగూడెంలో కళాకారులకు ఘనంగా డప్పుల పంపిణీ!

జాజిరెడ్డిగూడెం: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం జాజిరెడ్డిగూడెం గ్రామంలో దాత మరిపెద్ది శ్రీనివాస్ గౌడ్ అందించిన డప్పులను గ్రామంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ జాజిరెడ్డిగూడెం మండల పార్టీ అధ్యక్షుడు గుండగాని సోమేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. డప్పు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, గ్రామీణ కళాకారులను ప్రోత్సహించడం, వారి సంప్రదాయ కళలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. కళాకారులకు అవసరమైన వాయిద్య పరికరాలను అందించి వారిని ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చిన దాత మరిపెద్ది శ్రీనివాస్ గౌడ్‌ను అభినందించారు. భవిష్యత్తులో కూడా గ్రామ ప్రజలకు, కళాకారులకు ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.

డప్పులను అందించిన దాత మరిపెద్ది శ్రీనివాస్ గౌడ్‌కు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మొరిశెట్టి ఉపేందర్, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు వల్లపు గంగయ్య, బొడ్డు రామలింగయ్య, తాడూరి రామకోటి, మెండ్డే సురేష్, వెంకన్న, సోమిరెడ్డి, పొన్న హరిప్రసాద్, కోటమర్తి మల్లయ్య, కుంభం నాగరాజు, నర్సింగ వెంకన్న, పెద్ది శ్రీను, వార్డు సభ్యులు సురేష్, సందీప్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Muragundla, Veeraiah, Tungathurthy

Muragundla, Veeraiah, Tungathurthy