Huzurnagar: లింగగిరిలో జాతీయ క్యాన్సర్ అవగాహన ర్యాలీ!

Huzurnagar: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం లింగగిరి పీహెచ్‌సీ ఆధ్వర్యంలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. ప్రారంభంలో గుర్తిస్తే నయం చేయవచ్చని డాక్టర్ తెలిపారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR
Published on: 7 Nov 2026 4:06 PM IST
Huzurnagar
X

Huzurnagar: లింగగిరిలో జాతీయ క్యాన్సర్ అవగాహన ర్యాలీ!

హుజూర్ నగర్: హుజూర్ నగర్ మండలంలోని PHC లింగగిరి ఆధ్వర్యంలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో PHC లింగగిరి వైద్యాధికారి డాక్టర్ వేణుగోపాల్ నాయక్ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని, ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తిస్తే సరైన చికిత్స ద్వారా క్యాన్సర్‌ను నియంత్రించవచ్చని తెలిపారు.

పొగాకు, గుట్కా, ఖైనీ, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ద్వారా క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవచ్చని వివరించారు.

ముఖ్యంగా నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ లక్షణాలను ముందుగానే గుర్తించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో CHO పద్మ, నర్సింగ్ ఆఫీసర్ శివ ఫార్మసీ ఆఫీసర్ సంతోషి, ఆరోగ్య కార్యకర్తలు చంద్రకళ, ఇందిరాల రామకృష్ణ,ఆశా కార్యకర్తలుప్రశాంతి, కళమ్మ, స్వరూప, అనిత, గ్రామస్తులు పాల్గొన్నారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR