Suryapet: మురసు తుఫాన్ ఎఫెక్ట్: సూర్యాపేట జిల్లా అప్రమత్తం!

Suryapet: మురసు తుఫాన్ ప్రభావంతో సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 3 Nov 2026 8:46 PM IST
Suryapet
X

Suryapet: మురసు తుఫాన్ ఎఫెక్ట్: సూర్యాపేట జిల్లా అప్రమత్తం!

సూర్యాపేట: మురసు తుఫాన్ ప్రభావంతో రాబోయే కొన్ని గంటల్లో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు. ముఖ్యంగా కోదాడ, హుజూర్ నగర్ డివిజన్లలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, అవసరం లేని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు పాటించాలని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరిసింగ్, డీఆర్ఓ ప్రేమ్ రాజు, డీపీఓ యాదగిరి, డీఎస్ఓ మోహనబాబు, అధికారులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA