Suryapet: బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

Suryapet: సూర్యాపేటలో బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రజావాణిలో బాలల నుంచి 22 వినతులు స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 16 Nov 2026 8:28 PM IST
Suryapet
X

Suryapet: బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

సూర్యాపేట: బాలల హక్కులను పరిరక్షించడం, వారి జీవన విధానానికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బాలల హక్కుల పరిరక్షణతో పాటు వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఐడిఓసి కార్యాలయంలో బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా బాలల ప్రత్యేక ప్రజావాణి నిర్వహించి బాలల నుండి 22 వినతులు స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలల నుండి 22 దరఖాస్తులు అందినట్లు వెల్లడించారు. బాలలు తమ సమస్యలను ఎలాంటి భయం, సంకోచం లేకుండా స్వేచ్ఛగా అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. బాలల సమస్యలకు పరిష్కారం పొందేలా ప్రజావాణి ప్రాంగణంలో ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డిసిపియు సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

విద్య, వైద్యం, పోషకాహారం, బాలల రక్షణ, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలకు సంబంధించిన సమస్యలను బాలలు ప్రత్యేక డెస్క్ ద్వారా నేరుగా అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, డీఆర్వో ప్రేమ్ రాజు, జడ్పి సిఈఓ శిరీష, డిఆర్డిఓ పిడి సన్యాసయ్య, డి డబ్ల్యూ ఓ నరసింహారావు, బాల సంరక్షణ అధికారి రవికుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA