Suryapet: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతుంది

Suryapet: రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో బీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తుందని రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు ధీమా వ్యక్తం చేశారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 15 Nov 2026 9:52 PM IST
Suryapet
X

Suryapet: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతుంది

సూర్యాపేట: అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా ముంచి అన్ని వర్గాల ప్రజలను ఆగం చేసిందని, రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో 74 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ తన సత్తా చాటుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు అన్నారు.

ఆదివారం పట్టణంలోని 42వ వార్డులో బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, కౌన్సిలర్ అంగిరేకుల నాగార్జున అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఓటర్ నమోదు అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట పట్టణంలో అత్యధికంగా 350 ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేయడం బీఆర్ఎస్ నాయకుల శ్రమకు నిదర్శనమని అన్నారు. అత్యధికంగా ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసిన బీఆర్ఎస్ నాయకులను ఆయన అభినందించారు.

అసమర్థ రేవంత్ ప్రభుత్వం ఎల్ నినో పేరు చెబుతూ ప్రజలను మభ్యపెడుతుందని, ఇది ఎల్ నినోతో వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని అన్నారు. మన వద్ద కేవలం 17 శాతం లోటు వర్షపాతం మాత్రమే ఉందని, ఆంధ్రలో ఇంకా మనకంటే తక్కువ లోటు వర్షపాతం ఉందని, అక్కడ క్రాప్ హాలిడేలు ప్రకటించలేదని, ఇక్కడ మాత్రం పంటలు వేయవద్దని చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని అన్నారు.

హైదరాబాద్‌లో కార్లు కడిగితే ఫైన్లు వేస్తున్నారని, మహబూబ్‌నగర్ ప్రాంతంలో రైతులు చెరువు నీళ్లను వేలంపాట పాడుకొని మోటార్లు పెట్టుకొని పంటలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు వాన కోసం ఎదురుచూస్తున్నట్లుగానే కేసీఆర్ రాక కోసం ఎదురుచూస్తున్నారని, తప్పకుండా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు తెలంగాణ సొమ్ముతో భారత్ సమ్మిట్ నిర్వహించి విఫలమయ్యాడని అన్నారు. సమ్మిట్ పేరుతో విదేశీ పెట్టుబడులను తీసుకురావాలని, ఇక్కడ అలాంటిది జరగలేదని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐటీ మంత్రి కేటీఆర్ లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చి 15 లక్షల ఉద్యోగాలను సృష్టించాడని గుర్తు చేశారు. మరి ముఖ్యమంత్రి, మంత్రులు తెలంగాణ సొమ్ముతో విదేశాలకు వెళుతూ తెచ్చిన పెట్టుబడులు ఎంతో చెప్పాలని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంగిరేకుల నాగార్జున మాట్లాడుతూ నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని, రూ. 4000 నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని అన్నారు. భవిష్యత్తులో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్సీ ఓటర్ నమోదులో చురుకుగా పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు సట్టు శంకర్, సట్ల మధు, సట్ల నరేష్, జానీ, ఉమాకాంత్, మహేష్, రాము, పరమేష్, చెర్రీ, మోహన్, జంజిరాల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA