Suryapet: డబుల్ బెడ్‌రూమ్ ఇంట్లో బాలామృతం, పాలు నిల్వ చేయడంపై ఆరోపణలు
Suryapet: మద్దిరాలలో అంగన్‌వాడీ సరుకులను డబుల్ బెడ్‌రూమ్ ఇంట్లో నిల్వ చేసి పక్కదారి పట్టిస్తున్నారంటూ స్థానికులు ఆరోపించి విచారణ కోరుతున్నారు.
Suryapet: డబుల్ బెడ్‌రూమ్ ఇంట్లో బాలామృతం, పాలు నిల్వ చేయడంపై ఆరోపణలు
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రంలోని అంగన్‌వాడీ సెంటర్-3లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించాల్సిన బాలామృతం, పాల ప్యాకెట్లు పక్కదారి పడుతున్నాయంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.
అంగన్‌వాడీ కేంద్రానికి సమీపంలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇంట్లో బాలామృతం ప్యాకెట్లు, పాల ప్యాకెట్లను నిల్వ ఉంచి, వాటిని ఇంటికి తీసుకెళ్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. అంగన్‌వాడీ కేంద్రంలో లబ్ధిదారులకు అందాల్సిన పౌష్టికాహార సరుకులు బయటకు తరలించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు సరుకులను సరఫరా చేస్తున్నప్పటికీ, అవి లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అందుతున్నాయా లేదా అనే విషయంపై అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
ఈ వ్యవహారంపై సంబంధిత ఐసీడీఎస్ అధికారులు విచారణ చేపట్టి, సరుకుల నిల్వ, పంపిణీ రికార్డులను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తేవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆరోపణలు నిజమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.




