Suryapet: సూర్యాపేట మార్కెట్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: చైర్మన్!

Suryapet: సూర్యాపేట మార్కెట్‌ను రైతులకు మరింత చేరువ చేస్తూ ఆదర్శ మార్కెట్‌గా తీర్చిదిద్దుతామని మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి స్పష్టం చేశారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 12 Oct 2026 7:23 PM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేట మార్కెట్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: చైర్మన్!

సూర్యాపేట: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ను రైతులకు మరింత చేరువ చేస్తూ, వారి అవసరాలకు అనుగుణంగా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు.

సోమవారం సూర్యాపేట నూతన వ్యవసాయ మార్కెట్ యార్డులో నూతన గాల్‌వాల్యూమ్ షెడ్డు నిర్మాణానికి నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో, ఆయన మార్గదర్శకత్వంలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ను రాష్ట్రంలోనే ఆదర్శ మార్కెట్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. మార్కెట్‌కు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రైతులు ఎంతో కష్టపడి పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర లభించేలా కృషి చేస్తానని, గిట్టుబాటు ధరలు లభించేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని చెప్పారు.

మార్కెట్ యార్డులో పనిచేస్తూ రైతులకు, వ్యాపారులకు సేవలందిస్తున్న కార్మికుల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతానని, కార్మికుల సమస్యలను తెలుసుకొని వారి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మార్కెట్ అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి ఎండి ఫసియోద్దీన్, వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎండి షఫీ ఉల్లా, మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, అడ్తీ అసోసియేషన్, అపరాల అసోసియేషన్, ట్రేడర్స్ అసోసియేషన్, మిల్లర్ల అసోసియేషన్, హమాలీ కార్మికులు, స్వీపర్లు తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA