Suryapet: మిషన్ ఎయిడ్స్ సురక్షలో సూర్యాపేటకు ‘సురక్షిత్’ హోదా!
Suryapet: మిషన్ ఎయిడ్స్ సురక్షలో సూర్యాపేట జిల్లాకు ‘సురక్షిత్’ హోదా దక్కింది. విశేష సేవలందించిన వైద్య అధికారులను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అభినందించి సత్కరించారు.
Suryapet: మిషన్ ఎయిడ్స్ సురక్షలో సూర్యాపేటకు ‘సురక్షిత్’ హోదా!
సూర్యాపేట: మిషన్ ఎయిడ్స్ సురక్ష (Mission AIDS Suraksha - MAS) కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా SURAKSHIT హోదా సాధించింది. ఈ సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ IAS అధ్యక్షతన అభినందన కార్యక్రమం నిర్వహించారు.
HIV/AIDS నియంత్రణ కార్యక్రమంలో విశేష కృషి చేసి జిల్లాకు ఈ హోదా సాధించడంలో కీలక పాత్ర పోషించిన అధికారులను కలెక్టర్ ఘనంగా సత్కరించారు. సత్కారం పొందిన వారిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. వెంకట్ రమణ, ప్రోగ్రామ్ ఆఫీసర్ (A&L) డా. యనగందుల నాగరాజు, జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ (DPM), DAPCU శ్రీ వి. సుధాకర్, మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమ సహాయోగి రమేష్ ఉన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా HIV/AIDS బృందం చేసిన సమిష్టి కృషిని, అంకితభావాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో మరింత కృషి చేస్తూ తదుపరి లక్ష్యమైన SURAKSHIT PLUS హోదాను సాధించాలని సూచించారు.
HIV నివారణ, పరీక్షలు, చికిత్స, రోగుల నిరంతర సంరక్షణ వంటి సేవలను మరింత బలోపేతం చేయడంలో వైద్య ఆరోగ్య శాఖ, DAPCU, ART కేంద్రం, CSC బృందాలు, స్వచ్ఛంద సంస్థలు మరియు ఇతర భాగస్వామ్య విభాగాల సమన్వయ కృషి కీలకమని పేర్కొన్నారు.




