Suryapet: డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఆరుగురికి శిక్షలు ముగ్గురికి జైలు శిక్ష

Suryapet: సూర్యాపేటలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ఆరుగురికి కోర్టు శిక్షలు విధించింది. ముగ్గురికి జైలు శిక్ష పడగా, మరో ముగ్గురికి జరిమానా పడింది.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 15 Oct 2026 4:14 PM IST
Suryapet
X

Suryapet: డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఆరుగురికి శిక్షలు ముగ్గురికి జైలు శిక్ష

సూర్యాపేట: మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన ఆరుగురికి సూర్యాపేట కోర్టు శిక్షలు విధించింది. సూర్యాపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ప్రాంతాల్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఆరుగురిని బుధవారం కోర్టులో హాజరుపరచగా ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీమతి గోపు రజిత తీర్పు వెలువరించారని పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ యాదవేందర్ రెడ్డి తెలిపారు.

పట్టుబడిన వారిలో ఇద్దరికి రెండు రోజుల జైలు శిక్షతో పాటు జరిమానా, ఒకరికి మూడు రోజుల జైలు శిక్షతో పాటు జరిమానా, మరో ముగ్గురికి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.

జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎస్ఐ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాతో పాటు జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. పోలీసులు చేసే వాహన తనిఖీలు ప్రజల ప్రాణరక్షణ కోసమేనని, ప్రజలు సహకరించాలని కోరారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA