Suryapet: సూర్యాపేట: పురాతన దర్గాలో నిధుల వేట.. 12 మంది అరెస్ట్
Suryapet: సూర్యాపేట జిల్లా అనాజిపురంలోని పురాతన దర్గాలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న 12 మందిని పెన్‌పహాడ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Suryapet: సూర్యాపేట: పురాతన దర్గాలో నిధుల వేట.. 12 మంది అరెస్ట్
సూర్యాపేట: పెన్ పహాడ్ మండలం అనాజిపురం గ్రామంలోని పురాతన చారిత్రాత్మక దర్గాలో గుప్త నిధుల కోసం అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 16వ తేదీ రాత్రి కారు, బైక్ లలో వచ్చిన కొందరు వ్యక్తులు అనాజిపురం దర్గా ప్రాంగణంలోకి అక్రమంగా ప్రవేశించి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతూ దర్గాకు నష్టం కలిగిస్తున్నారు. దీనిని గమనించిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే పెన్ పహాడ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తవ్వకాలు జరుపుతున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ముగ్గురు అక్కడి నుండి పరారయ్యారు.
అనంతారం గ్రామ GPO గా పనిచేస్తున్న పెరుమళ్ల పిచ్చమ్మ ఫిర్యాదు మేరకు పెన్ పహాడ్ SI N. బాలు నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సూర్యాపేట రూరల్ CI G. రాజశేఖర్ ఆధ్వర్యంలో SI బాలు నాయక్ బృందం విచారణ చేపట్టి, పరారీలో ఉన్న వారితో సహా మొత్తం 12 మంది నిందితులను నేడు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇంకో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.
నిందితుల నుండి 1 కారు, 2 బైక్ లు, 1 స్కూటీ, 2 పారలు, 2 టెంకలు, 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ సందర్భంగా CI రాజశేఖర్ మాట్లాడుతూ.. గుప్త నిధుల పేరుతో జరిగే మోసాలను ప్రజలు నమ్మవద్దని, ఇలాంటి అక్రమ కార్యకలాపాలు, చారిత్రాత్మక కట్టడాలకు నష్టం కలిగించే చర్యలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.




