Nalgonda: నల్గొండలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో జూనియర్ కళాశాలల బంద్!
Nalgonda: ఖమ్మం జిల్లాలో విద్యార్థి దాడిలో మృతి చెందిన అధ్యాపకుడు గోపాలకృష్ణ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్.
Nalgonda: నల్గొండలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో జూనియర్ కళాశాలల బంద్!
Nalgonda: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థి దాడిలో మృతి చెందిన అధ్యాపకుడు మేకల గోపాలకృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలలను ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. కళాశాలల్లో మత్తుపదార్థాల కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి మారుపాక కిరణ్, డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గుండాల నరేష్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆదిల్, హరీష్, కల్పన, రాధిక, అంజలి, స్పందన పాల్గొన్నారు.




