Nalgonda: నల్లగొండ: కార్మిక-కర్షక ఐక్యతను చాటాలి: సీఐటీయూ

Nalgonda: నవంబర్ 15న నల్లగొండ ఎన్జీ కాలేజీ గ్రౌండ్‌లో జరిగే ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభల భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని సీఐటీయూ నేతలు పిలుపునిచ్చారు.

Saleem, Nalgonda
Published on: 9 Nov 2026 7:01 PM IST
Nalgonda
X

Nalgonda: నల్లగొండ: కార్మిక-కర్షక ఐక్యతను చాటాలి: సీఐటీయూ

నల్లగొండ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు కార్మిక-కర్షక ఐక్యతను బలోపేతం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శి ఎండి సలీం పిలుపునిచ్చారు.

​అఖిల భారత రైతు సంఘం (ఏఐకేఎస్) జాతీయ 36వ మహాసభల సందర్భంగా నవంబర్‌ 15న నల్గొండలోని ఎన్జీ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. సోమవారం నల్గొండలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో సభకు సంబంధించిన ప్రచార కరపత్రాలను వారు ఆవిష్కరించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda