Nalgonda: విద్యార్థులకు మార్కులతో పాటు నైతిక విలువలు నేర్పాలి ఎస్పీ!
Nalgonda: నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ పిలుపు. విద్యార్థులకు మార్కులతో పాటు నైతిక విలువలు నేర్పించాలని, సోషల్ మీడియా ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలని సూచన.
Nalgonda: విద్యార్థులకు మార్కులతో పాటు నైతిక విలువలు నేర్పాలి ఎస్పీ!
Nalgonda: విద్యార్థులకు కేవలం మార్కులు, ర్యాంకులు మాత్రమే కాకుండా సమాజంలో నైతిక విలువలు, గౌరవాన్ని నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ స్పష్టం చేశారు. నేటి డిజిటల్ యుగంలో పిల్లలు సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) ప్రభావంతో చెడు మార్గంలో పయనించకుండా చూడాలని పిలుపునిచ్చారు.
ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పిల్లల్లో క్రమశిక్షణ, సన్మార్గం పెంపొందించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎస్పీ సూచించారు.




