Nalgonda: పోలీస్ గ్రీవెన్స్ డేకు 53 అర్జీలు.. స్వీకరించిన ఎస్పీ!

Nalgonda: నల్లగొండ జిల్లా పోలీస్ గ్రీవెన్స్ డేలో 53 దరఖాస్తులను ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్వీకరించారు. బాధితుల ఫిర్యాదులపై తక్షణమే విచారణ జరిపి న్యాయం చేయాలని ఆదేశించారు.

Saleem, Nalgonda
Published on: 5 Oct 2026 7:02 PM IST
Nalgonda
X

Nalgonda: పోలీస్ గ్రీవెన్స్ డేకు 53 అర్జీలు.. స్వీకరించిన ఎస్పీ!

నల్గొండ: ​బాధితుల ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించి నిష్పక్షపాతంగా న్యాయం చేయాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన 'గ్రీవెన్స్ డే'లో వివిధ గ్రామాల నుంచి వచ్చిన 53 మంది బాధితుల నుంచి ఆయన ఆర్జీలను స్వీకరించారు.

భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక మోసాలపై వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో సమగ్రంగా విచారించి, చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. బాధితులకు న్యాయం చేయడంలో జాప్యం సహించబోమని, కేసుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda