Suryapet: మద్దిరాలలో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల బీమా చెక్కు!
Suryapet: మద్దిరాలలో కారు ప్రమాదంలో మరణించిన ఏకస్వామి కుటుంబానికి రూ.5 లక్షల బీమా చెక్కు. 14 ఏళ్లపాటు నెలకు రూ.2,250 పింఛన్ ఇవ్వనున్న శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్.
Suryapet: మద్దిరాలలో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల బీమా చెక్కు!
Suryapet: సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రానికి చెందిన మెడిదల ఏకస్వామి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో సంవత్సరానికి రూ.15,575 ప్రీమియంతో AIP ప్లాన్ తీసుకున్నారు. పాలసీ తీసుకున్న 20 రోజుల్లోనే జరిగిన కారు ప్రమాదంలో ఏకస్వామి మృతి చెందారు.ఈ నేపథ్యంలో పాలసీ నిబంధనల ప్రకారం నామినీ మెడిదల అనుషకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతినిధులు రూ.5 లక్షల బీమా చెక్కును అందజేశారు. అలాగే ఆమెకు నెలకు రూ.2,250 చొప్పున 14 సంవత్సరాల పాటు పెన్షన్ అందించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మద్దిరాల మండల అధ్యక్షులు పచ్చిపాల వెంకన్న యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి జీవిత బీమా ఎంతో అవసరమని, కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడంలో జీవిత బీమా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. బాధిత కుటుంబానికి బీమా ప్రయోజనం అందించిన శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థను అభినందించారు.కార్యక్రమంలో దండంపల్లి ఉమేష్, అనిల్, సాయి సతీష్, లింగయ్య అదేవిధంగా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ తరఫున డీజీఎం సతీష్ కుమార్, డీఎం భరత్, బ్రాంచ్ మేనేజర్ సురేష్, డీఓ గోల్కొండ సుధాకర్, దస్తగిరి, కంపెనీ ఉద్యోగి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.




