Nalgonda: నల్గొండలో ఆపదలో ఉన్న బీహార్ కుటుంబానికి సేవా భారతి సాయం!
Nalgonda: నల్గొండలో ఉపాధి కోసం వచ్చి మృతి చెందిన బీహార్ మహిళ కుటుంబాన్ని సేవా భారతి సభ్యులు ఆదుకుని అంబులెన్స్, అంత్యక్రియలు ఏర్పాట్లు చేశారు.
Nalgonda: నల్గొండలో ఆపదలో ఉన్న బీహార్ కుటుంబానికి సేవా భారతి సాయం!
Nalgonda: ఉపాధి కోసం బీహార్ నుంచి నల్గొండకు వచ్చిన ఒక పేద కుటుంబంలో మాతృమూర్తి అక్టోబర్ 1న అనారోగ్యంతో కన్నుమూశారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు, అంత్యక్రియలు నిర్వహించేందుకు తగిన ఆర్థిక స్థోమత లేక ఆ కుటుంబం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తీవ్ర అవస్థలు పడింది.
విషయం తెలుసుకున్న సేవా భారతి నల్గొండ సభ్యులు వెంటనే స్పందించారు. సొంత ఖర్చులతో అంబులెన్స్‌ను ఏర్పాటు చేయడమే కాకుండా, స్వచ్ఛందంగా ముందుకొచ్చి దహన సంస్కారాలు పూర్తి చేశారు. ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా ఆపద సమయంలో అండగా నిలిచి గౌరవప్రదంగా అంతిమ వీడ్కోలు కల్పించిన సేవా భారతి ప్రతినిధులకు బాధిత కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కందుల శిరీష్, భీమనపల్లి శ్రీకాంత్ రాజు, సందీప్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.




