Suryapet: మద్దిరాల ఎక్స్ రోడ్డులో తీవ్ర ట్రాఫిక్ సమస్య.. ప్రయాణికుల అవస్థలు!

Suryapet: మద్దిరాల ఎక్స్ రోడ్డు వద్ద ఆక్రమణలు, అస్తవ్యస్త పార్కింగ్ కారణంగా ట్రాఫిక్ సమస్య తీవ్రమైంది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Muragundla, Veeraiah, Tungathurthy
Published on: 29 Nov 2026 1:19 PM IST
Suryapet
X

Suryapet: మద్దిరాల ఎక్స్ రోడ్డులో తీవ్ర ట్రాఫిక్ సమస్య.. ప్రయాణికుల అవస్థలు!

Suryapet: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలంలోని ఎక్స్ రోడ్డు వద్ద ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. రోడ్డు పక్కన ఉండాల్సిన నేమ్ బోర్డులు రోడ్డుపైనే ఏర్పాటు చేయడం, రోడ్డు మీద తాత్కాలికంగా రేకుల షెడ్లు వేయడం, నడిరోడ్డుపైనే ఆటోలను నిలిపివేయడం, రోడ్లపై ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

దీంతో అటువైపు రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలతో పాటు ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బస్సులు వెళ్లేందుకు సరైన దారి లేక ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపై ఉన్న ఆక్రమణలు, అడ్డంకులను తొలగించి, ఆటోలు మరియు ద్విచక్ర వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి రాకపోకలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Muragundla, Veeraiah, Tungathurthy

Muragundla, Veeraiah, Tungathurthy