Nalgonda: నల్లగొండ క్లాక్ టవర్ సుందరీకరణకు రూ. 197.44 కోట్లు
Nalgonda: నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్ సుందరీకరణకు ప్రపంచ బ్యాంకు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి రూ. 197.44 కోట్లు మంజూరు చేయగా, ప్రాజెక్ట్ లోగోను మేయర్ ఆవిష్కరించారు.
Nalgonda: నల్లగొండ క్లాక్ టవర్ సుందరీకరణకు రూ. 197.44 కోట్లు
నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. క్లాక్ టవర్ సెంటర్ సుందరీకరణకు రూ. 197.44 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో ప్రపంచ బ్యాంకు రూ. 138.21 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 59.23 కోట్లు కేటాయించాయి. పాత ఆర్ అండ్ బి కార్యాలయ స్థలంలో అధునాతన రీతిలో కమర్షియల్ కాంప్లెక్స్, మల్టీప్లెక్స్ నిర్మించనున్నారు.
శనివారం కార్పొరేషన్ కార్యాలయంలో ఈ అభివృద్ధి పనుల లోగోను మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్లతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మేయర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.




