Huzurnagar: రైస్ మిల్లుల ధూళి కాలుష్యంతో ఐదు వార్డుల ప్రజల అవస్థలు!

Huzurnagar: హుజూర్‌నగర్ లింగగిరి రోడ్డులోని రెండు రైస్ మిల్లుల ధూళి కాలుష్యంతో 5 వార్డుల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కౌన్సిలర్ కృష్ణ గౌడ్ బుధవారం వినతిపత్రం ఇచ్చారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR
Published on: 18 Nov 2026 6:03 PM IST
Huzurnagar
X

Huzurnagar: రైస్ మిల్లుల ధూళి కాలుష్యంతో ఐదు వార్డుల ప్రజల అవస్థలు!

హుజూర్‌నగర్: పట్టణంలోన 19వ వార్డు పరిధి లింగరిగి రోడ్డులో ఉన్న రెండు రైస్ మిల్లుల నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళి కాలుష్యంతో 15,15,17,18,19 వార్డులకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని 19వ వార్డు కౌన్సిలర్ వల్లపుదాస్ కృష్ణ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.

రైస్ మిల్లుల నుంచి ప్రతిరోజూ వెలువడుతున్న ధూళి ఇళ్లలోకి, వీధుల్లోకి చేరి ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తోందని తెలిపారు. ఉదయం నిద్రలేచే సమయానికే ఇళ్ల ఆవరణలు, పరిసర ప్రాంతాలు ధూళితో నిండిపోతున్నాయని పేర్కొన్నారు. ఈ కాలుష్యం కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజలు స్వచ్ఛమైన గాలిని పీల్చుకోలేని పరిస్థితి నెలకొందని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్‌లకు వినతిపత్రం అందజేశారు.

లింగరిగి రోడ్డులోని రెండు రైస్ మిల్లులను అధికారులు వెంటనే తనిఖీ చేయాలని, ధూళి కాలుష్యాన్ని నియంత్రించేందుకు అవసరమైన పరికరాలను ఏర్పాటు చేయించాలని కోరారు. కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటించని మిల్లుల యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని, అధికారులు ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించి ప్రజలకు కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలని కౌన్సిలర్ వల్లపుదాస్ కృష్ణ గౌడ్ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు షేక్ సైదా, టీమ్ 19 సభ్యులు షేక్ మీరా పాషా, 18వ వార్డు కౌన్సిలర్ జక్కుల మల్లయ్య, 1వ వార్డు కౌన్సిలర్ నందిగామ శ్రీను, 28వ వార్డు కౌన్సిలర్ మోదాల సైదులు, చిన్నపంగు ప్రవీణ్, చనగాని సైదులుతో పాటు 19వ వార్డు ప్రజలు పాల్గొన్నారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR