Chintalapalem: తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఆర్ఐ ఆత్రేయ పర్యటన

Chintalapalem: తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చింతలపాలెం ఆర్ఐ ఆత్రేయ దొండపాడులో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR
Published on: 3 Nov 2026 3:24 PM IST
Chintalapalem
X

Chintalapalem: తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఆర్ఐ ఆత్రేయ పర్యటన

చింతలపాలెం: తుఫాన్ ప్రభావంతో మండల వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, చింతలపాలెం రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) ఆత్రేయ మంగళవారం ఉదయం మండలంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. అందులో భాగంగా దొండపాడు గ్రామాన్ని సందర్శించి అక్కడ కురుస్తున్న వర్షపాతం, నెలకొన్న పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.

ప్రస్తుతం గ్రామంలో నిరంతరాయంగా వర్షం పడుతున్నప్పటికీ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఎక్కడా ఇండ్లు కూలిపోవడం గానీ, ఎలాంటి ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం జరగలేదని ఆర్ఐ స్పష్టం చేశారు. మండలంలోని తుఫాన్ ఎఫెక్టెడ్ ప్రాంతాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అధికారులు అప్రమత్తంగా ఉన్నారని ఆయన వెల్లడించారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR