Nagarjunasagar: సాగర్ బ్యాక్‌వాటర్‌లో అక్రమ ఇంటెక్ వెల్ పనుల పరిశీలన!
Nagarjunasagar: పల్నాడు జిల్లా విజయపురి సౌత్ పరిధిలోని నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్‌లో అక్రమ ఇంటెక్ వెల్ సంపు పనులను శుక్రవారం శ్యాం ప్రసాద్‌రెడ్డి పరిశీలించారు.
Nagarjunasagar: సాగర్ బ్యాక్‌వాటర్‌లో అక్రమ ఇంటెక్ వెల్ పనుల పరిశీలన!
నాగార్జునసాగర్: పల్నాడు జిల్లా మాచర్ల మండలం విజయపురి సౌత్ పరిధిలోని నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్‌లో అక్రమంగా నిర్మిస్తున్న ఇంటెక్ వెల్ సంపు పనులను రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కన్వీనర్ శ్యాం ప్రసాద్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. జలాశయ నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ నిర్మాణాలపై ఆయన ఆరా తీశారు. ప్రాజెక్టు భద్రత, నీటి వనరుల పరిరక్షణ దృష్ట్యా అధికారుల తీరుపై పలు అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.




