Thipparthy: వివోఏ అన్నపూర్ణను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి: సీఐటీయూ!
Thipparthy: రాజకీయ ఒత్తిళ్లతో తొలగించిన మామిడాల గ్రామ వివోఏ అన్నపూర్ణను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని తిప్పర్తిలో 18వ రోజు సమ్మె శిబిరంలో నేతలు డిమాండ్ చేశారు.
Thipparthy: వివోఏ అన్నపూర్ణను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి: సీఐటీయూ!
నల్లగొండ: అకారణంగా తొలగించిన మామిడాల గ్రామ వివోఏ అన్నపూర్ణను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, ఉద్యోగులపై అధికారుల వేధింపులు అరికట్టాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, ఐకేపీ వివోఏ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చిలుముల దుర్గయ్య డిమాండ్ చేశారు. సోమవారం తిప్పర్తి మండల సమైక్య కార్యాలయం ఎదుట వివోఏలు చేపట్టిన సమ్మె 18వ రోజుకు చేరగా వారు శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు.
రాజకీయ ఒత్తిళ్లతో తొలగించిన అన్నపూర్ణను తిరిగి తీసుకోకుంటే ఆందోళనను జిల్లావ్యాప్తంగా ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు భీమగాని గణేష్, పోకల శశిధర్, మంత్రాల మంగమ్మ, ఎండీ రుమాన, జక్కల అనిత తదితరులు పాల్గొన్నారు.




