Tungaturthi: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు చేసుకోవాలి

Tungaturthi: తుంగతుర్తిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు వేగవంతం చేయాలని యూత్ కాంగ్రెస్ నేత ఎల్లేష్ విజ్ఞప్తి. నవంబర్ 6 ఆఖరి తేదీగా వెల్లడి.

Muragundla, Veeraiah, Tungathurthy
Published on: 31 Oct 2026 4:30 PM IST
Tungaturthi
X

Tungaturthi: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు చేసుకోవాలి

తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని యూత్ కాంగ్రెస్ మద్దిరాల మండల అధ్యక్షుడు కుజ ఎల్లేష్ కోరారు.ఉమ్మడి వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపు కోసం కృషి చేసే దిశగా పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంపై ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా కుజ ఎల్లేష్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనాలంటే ముందుగా ఓటరుగా నమోదు చేసుకోవడం తప్పనిసరని తెలిపారు. అర్హత కలిగిన పట్టభద్రులు ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కలిగి ఉండటంతో పాటు తమ స్నేహితులు, సహచర పట్టభద్రులకు కూడా సమాచారం అందించాలని సూచించారు.

పట్టభద్రుల ఓటరు నమోదు చేసుకోవడానికి నవంబర్ 6వ తేదీ చివరి గడువు కావడంతో అర్హులైన ప్రతి ఒక్కరూ ఆలస్యం చేయకుండా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో పట్టభద్రులందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

Muragundla, Veeraiah, Tungathurthy

Muragundla, Veeraiah, Tungathurthy