Suryapet: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోండి కట్ట మల్లారెడ్డి!
Suryapet: వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు నవంబర్ 6: అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ నమోదు చేసుకోవాలని నూతనకల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కట్ట మల్లారెడ్డి పిలుపు.
Suryapet: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోండి కట్ట మల్లారెడ్డి!
సూర్యాపేట: ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని నూతనకల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్ట మల్లారెడ్డి పిలుపునిచ్చారు.
తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ ఆదేశాల మేరకు ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనాలంటే ముందుగా ఓటరుగా నమోదు చేసుకోవడం ముఖ్యమని తెలిపారు. అర్హత కలిగిన పట్టభద్రులందరూ ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలని, తమ స్నేహితులు, సహచర పట్టభద్రులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయాలని కోరారు.
పట్టభద్రుల ఓటరు నమోదు చేసుకోవడానికి నవంబర్ 6వ తేదీ చివరి గడువు కావడంతో ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా, ఆలస్యం చేయకుండా అర్హులైన ప్రతి పట్టభద్రుడు వెంటనే తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో పట్టభద్రులందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.




