Nalgonda: రెడ్‌క్రాస్ నూతన చైర్‌పర్సన్ హేమలతకు దుకాణదారుల సన్మానం!

Nalgonda: నల్లగొండ జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ నూతన చైర్‌పర్సన్‌గా ఎన్నికైన డాక్టర్ పులిపాటి హేమలతను కాంప్లెక్స్ దుకాణదారులు సన్మానించారు.

Saleem, Nalgonda
Published on: 29 Oct 2026 1:08 PM IST
Nalgonda
X

Nalgonda: రెడ్‌క్రాస్ నూతన చైర్‌పర్సన్ హేమలతకు దుకాణదారుల సన్మానం!

Nalgonda: జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ నూతన చైర్‌పర్సన్‌గా ఎన్నికైన డాక్టర్ పులిపాటి హేమలతను రెడ్‌క్రాస్ సొసైటీ కాంప్లెక్స్ దుకాణదారులు మర్యాదపూర్వకంగా కలిసి, శాలువా మరియు పూలబొకేలతో ఘనంగా సన్మానించారు.

​ఈ సందర్భంగా కాంప్లెక్స్‌లో ఎదురవుతున్న పార్కింగ్ సమస్యతో పాటు ఇతర ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతూ చైర్‌పర్సన్ హేమలత, వైస్ చైర్మన్ శ్రీకాంత్‌లకు దుకాణదారులు వినతిపత్రం సమర్పించారు.

​దుకాణదారుల మనవిపై సానుకూలంగా స్పందించిన చైర్‌పర్సన్ డాక్టర్ హేమలత, వైస్ చైర్మన్ భీమనపల్లి శ్రీకాంత్, కార్యదర్శి గుంటి రామకృష్ణ... కాంప్లెక్స్ సమస్యలు, అవసరమైన మరమ్మతుల అంశాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే సొసైటీ అభివృద్ధికి దుకాణదారులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ ప్రతినిధులు, వ్యాపారులు పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda