Suryapet: పులిచింతలకు స్వల్పంగా పెరిగిన ఇన్‌ఫ్లో

Suryapet: మురాసు తుఫాన్ వర్షాలతో పులిచింతల ప్రాజెక్టులోకి 3,743 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 27.6413 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR
Published on: 3 Nov 2026 6:51 PM IST
Suryapet
X

Suryapet: పులిచింతలకు స్వల్పంగా పెరిగిన ఇన్‌ఫ్లో

సూర్యాపేట జిల్లా: మురాసు తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నదిలో పులిచింతల ప్రాజెక్టుకు స్వల్పంగా నీటి ప్రవాహం కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు ప్రాజెక్టులోకి 3,743 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, లీకేజీల ద్వారా 400 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 27.6413 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా, ప్రస్తుతం 161.776 అడుగుల నీటిమట్టం నమోదైంది. తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులోకి నీటి ప్రవాహం స్వల్పంగా కొనసాగుతుంది.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR