Nalgonda: దేశ సమైక్యతను కాపాడాలి: కలెక్టర్ బి. చంద్రశేఖర్

Nalgonda: నల్గొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన జాతీయ ఐక్యత దినోత్సవంలో కలెక్టర్ బి. చంద్రశేఖర్ పాల్గొని, సర్దార్ పటేల్ సేవలను స్మరించుకుంటూ దిశానిర్దేశం చేశారు.

Saleem, Nalgonda
Published on: 31 Oct 2026 5:33 PM IST
Nalgonda
X

Nalgonda: దేశ సమైక్యతను కాపాడాలి: కలెక్టర్ బి. చంద్రశేఖర్

Nalgonda: దేశ సమైక్యతను, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో భారత తొలి హోంశాఖ మంత్రి, ‘ఉక్కు మనిషి’ సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతి సందర్భంగా నిర్వహించిన ‘జాతీయ ఐక్యత దినోత్సవానికి’ ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వతంత్ర భారత నిర్మాణంలో పటేల్ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ పిలుపు మేరకు పాల్గొని, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్‌లతో కలిసి పోరాడారని గుర్తుచేశారు.

దేశంలో విలీనం కాని సంస్థానాలను ఐక్యం చేయడంలో ఆయన చూపిన చొరవ అద్భుతమని, 1948 సెప్టెంబరు 17న హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసిన తీరును ప్రతి ఒక్కరూ స్ఫురణకు తెచ్చుకోవాలన్నారు. పటేల్ జ్ఞాపకార్థం గుజరాత్‌లోని కెవాడియాలో నర్మదా నది ఒడ్డున ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ని నెలకొల్పారని, జాతీయ సమైక్యత దినోత్సవం పురస్కరించుకుని నల్గొండ జిల్లా నుంచి ఒక ప్రతినిధి బృందం అక్కడికి వెళ్లినట్లు తెలిపారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda