Suryapet: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - బోల్తా పడిన ప్రైవేట్ బస్సు!
Suryapet: సూర్యాపేట జిల్లా మోతే మండలం హుస్సేనాబాద్ వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా. నలుగురికి తీవ్రగాయాలు, ఒక మహిళ పరిస్థితి విషమం.
Suryapet: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - బోల్తా పడిన ప్రైవేట్ బస్సు!
Suryapet: సూర్యాపేట జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోతే మండలం హుస్సేనాబాద్ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలు కాగా అందులో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డవారిని సూర్యాపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అధికారులు.
ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




