Nuthankal: మాచినపల్లిలో పోలీసుల దాడులు: నాటుసారా స్వాధీనం!

Nuthankal: మాచినపల్లిలో పోలీసులు దాడులు నిర్వహించి 5 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 18 Nov 2026 10:55 AM IST
Nuthankal
X

Nuthankal: మాచినపల్లిలో పోలీసుల దాడులు: నాటుసారా స్వాధీనం!

Nuthankal: నూతనకల్ మండలం మాచినపల్లి గ్రామంలో నాటుసారా విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు నూతనకల్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గ్రామంలోని రెండు ప్రాంతాల్లో మొత్తం ఐదు లీటర్ల నాటుసారా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

ఒక ప్రాంతంలో మూడు లీటర్లు, మరో ప్రాంతంలో రెండు లీటర్ల నాటుసారా లభించగా, వాటిని సీజ్ చేసి సంబంధిత ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు నూతనకల్ ఎస్ఐ నాగరాజు తెలిపారు.

జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రభుత్వం నిషేధించిన నాటుసారా తయారీ, విక్రయాలను మండల పరిధిలో పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా కఠినంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎస్ఐ తెలిపారు.

మండల పరిధిలో ఎక్కడైనా నాటుసారా తయారీ, విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే ప్రజలు నిర్భయంగా పోలీసులకు నేరుగా సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. నాటుసారా నిర్మూలనకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్ఐ నాగరాజు విజ్ఞప్తి చేశారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA