Kodad: 120 కిలోల గంజాయి పట్టివేత.. కారులో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు!

Kodad: కోదాడ వద్ద జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు చేపట్టి కారులో అక్రమంగా తరలిస్తున్న 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

V.PURNA CHANDRARAO, KODAD
Published on: 1 Nov 2026 7:55 AM IST
Kodad
X

Kodad: 120 కిలోల గంజాయి పట్టివేత.. కారులో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు!

Kodad: పట్టణంలో భారీగా గంజాయి పట్టుబడింది. రాజమండ్రి నుంచి బెంగళూరుకు కారులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులకు నమ్మదగిన సమాచారం అందింది.

దీంతో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై కోదాడ పట్టణ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గుర్తించిన పోలీసులు సుమారు 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

గంజాయి అక్రమ రవాణా వెనుక ఎవరెవరి ప్రమేయం ఉంది, ఈ అక్రమ రవాణా నెట్‌వర్క్‌లో ఇంకా ఎంతమంది ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో నిర్వహించనున్న మీడియా సమావేశంలో వెల్లడించనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. పోలీసుల దర్యాప్తు పూర్తయితే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

V.PURNA CHANDRARAO, KODAD

V.PURNA CHANDRARAO, KODAD