Suryapet: సూర్యాపేటలో ఘనంగా 'రన్ ఫర్ యూనిటీ'.. పాల్గొన్న 500 మందికి పైగా యువత!

Suryapet: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని సూర్యాపేటలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 'రన్ ఫర్ యూనిటీ' ఘనంగా నిర్వహించారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 31 Oct 2026 9:36 AM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేటలో ఘనంగా 'రన్ ఫర్ యూనిటీ'.. పాల్గొన్న 500 మందికి పైగా యువత!

Suryapet: ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 'రన్ ఫర్ యూనిటీ' ఘనంగా నిర్వహించారు.

జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల చౌరస్తా నుండి సద్దుల చెరువు ట్యాంక్ బండ్ వరకు ఐక్యతా పరుగు ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 500 మందికి పైగా యువత, పోలీస్ సిబ్బంది, వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశ సమైక్యతను చాటిచెప్పేలా ప్లకార్డులు చేతబూని, దేశభక్తి నినాదాలతో విద్యార్థులు, యువత ఉత్సాహంగా పరుగులు తీశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేశ సమగ్రత, ఐక్యత కోసం పటేల్ చేసిన సేవలు ఎనలేనివని, ఆయన జీవితం నేటి యువతకు గొప్ప స్ఫూర్తిదాయకమన్నారు. దేశవ్యాప్తంగా ఆయన జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నామని, పటేల్ గారికి నిజమైన నివాళులు అర్పించడమంటే అనుక్షణం మనమంతా దేశ సమగ్రతకు, అభివృద్ధికి కట్టుబడి పనిచేయడమేనని అన్నారు. యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA