Maddirala: మద్దిరాల మండలంలో పోలీసుల కార్డెన్ సెర్చ్.. 53 బైకులు సీజ్!
Maddirala: మద్దిరాల మండలంలో డీఎస్పీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పత్రాలు లేని 53 బైకులు, 3 త్రీ-వీలర్లను సీజ్ చేశారు.
Maddirala: మద్దిరాల మండలంలో పోలీసుల కార్డెన్ సెర్చ్.. 53 బైకులు సీజ్!
Maddirala: సూర్యాపేట జిల్లా ఎస్పీ కే. నర్సింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు, సూర్యాపేట సబ్ డివిజన్ పరిధిలోని శనివారం రాత్రి మద్దిరాల గ్రామంలో డీఎస్పీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో ఇద్దరు సిఐలు ఐదుగురు ఎస్సైలు 80 మంది సిబ్బంది తో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
53 ద్విచక్ర వాహనాలు మూడు త్రీ వీలర్లు సీజ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల్లో భరోసా కల్పించడం ప్రజల్లో పోలీసులపై నమ్మకం, విశ్వాసం పెంపొందించడానికి మరియు పోలీసులు మీ వెంటే ఉన్నారు అనే భరోసా కల్పించడానికి ప్రతి వారం, ప్రతి నెల ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఇళ్లు మరియు వీధుల తనిఖీ ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటిని, కాలనీని మరియు వీధిని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది.
వాహనాల పరిశీలన ఇళ్ల వద్ద ఉన్న వాహనాలను, వాటి డాక్యుమెంట్లను పూర్తిగా పరిశీలించి, పత్రాలు లేని వాహనాలపై తగిన చర్యలు తీసుకుంటారు.నేరస్తుల గుర్తింపు (పాపులేషన్ యాప్): బయటి వ్యక్తులు వచ్చి నివసించడం లేదా నేరాలు చేసి ఇక్కడ ఆశ్రయం పొందడాన్ని అరికట్టడానికి పాపులేషన్ యాప్ ద్వారా ప్రతి ఒక్కరి ఫింగర్ ప్రింట్స్ తనిఖీ చేస్తారు.
దీనివల్ల నేరస్తులను వెంటనే గుర్తించడానికి వీలవుతుంది.గాంజా నిరోధక కిట్స్: కొత్తగా అందుబాటులోకి వచ్చిన గాంజా కిట్స్ ద్వారా ఎవరైనా గాంజా సేవించారా లేదా అని ఇమీడియట్గా గుర్తించవచ్చు. వ్యక్తి గాంజా సేవించినట్లయితే 9 నెలల వరకు కూడా ఈ కిట్స్ ద్వారా గుర్తించే అవకాశం ఉంది.
ప్రజల సహకారం సమాజంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా, ప్రజలు ప్రశాంతంగా తమ దైనందిన జీవితాన్ని గడపడానికి కృషి చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని డీఎస్పీ ప్రసన్నకుమార్ అన్నారు.ఈ తనిఖీల్లో సహకరించిన గ్రామ ప్రజలకు పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.




