Miryalaguda: పీఎం విశ్వకర్మతో మహిళలకు ఆర్థిక స్వావలంబన: చిలుకూరి శ్యామ్!

Miryalaguda: మిర్యాలగూడలో ఏపీఐటీసీవో సహకారంతో జరిగిన పీఎం విశ్వకర్మ 2వ విడత శిక్షణలో మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని కన్వీనర్ చిలుకూరి శ్యామ్ పిలుపునిచ్చారు.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 6 Nov 2026 4:13 PM IST
Miryalaguda
X

Miryalaguda: పీఎం విశ్వకర్మతో మహిళలకు ఆర్థిక స్వావలంబన: చిలుకూరి శ్యామ్!

Miryalaguda: ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం2వ విడత APITCO సహకారం తో అదునాతన శిక్షణ గడగొజు మిర్యాలగూడలో బిల్డింగ్ హనుమాన్ టెంపుల్ వద్ద వృత్తి శిక్షణ పొందిన మహిళలను ఉద్దేశించి నియోజకవర్గం కన్వీనర్ చిలుకూరి శ్యామ్ మాట్లాడుతూ మహిళలు ఈ పథకం ద్వారా శిక్షణ పొంది నైపుణ్యం ద్వారా దేశం పునర్నిర్మిచబడుతుంది.

దాని ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంభన దిశ వైపు పయనించాలానే సంకల్పంతో, కుటుంబానికి ఆసరాగా తోడ్పాటు ఉంటుంది అనే ఆలోచనతో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రవేశ పెట్టిన పథకం ఈ పథకంలో 18 రకాల కుల వృత్తుల వారికి ఉచిత శిక్షణ కల్పిస్తారు, మహిళలు, యువకులు, వృత్తి కళాకారులూ అందరూ కూడ అప్లికేషన్స్ చేసుకొవచ్చుని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కో కన్వీనర్ చిల్లంచర్ల అభి, మాజీ కౌన్సిలర్ చిలుకూరి రమాదేవి రవికుమార్, నరేందర్ లు పాల్గొన్నారు.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA