Nalgonda: పీఎం శ్రీ హెచ్‌ఎంల అధ్యయన యాత్ర బస్సును ప్రారంభించిన ఏడీ రామాచారి

Nalgonda: పీఎం శ్రీ పాఠశాలల హెచ్‌ఎంల బెంగళూరు, మైసూర్ అధ్యయన యాత్ర ప్రారంభం. ఐఐఎస్సీ, ప్రసిద్ధ విద్యా సంస్థల్లో 4 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ.

Saleem, Nalgonda
Published on: 29 Oct 2026 6:54 PM IST
Nalgonda
X

Nalgonda: పీఎం శ్రీ హెచ్‌ఎంల అధ్యయన యాత్ర బస్సును ప్రారంభించిన ఏడీ రామాచారి

నల్గొండ: పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు వృత్యంత శిక్షణ, సామర్థ్యాభివృద్ధిలో భాగంగా కర్ణాటకలోని బెంగళూరు, మైసూర్ అధ్యయన యాత్రకు జిల్లా విద్యాధికారి కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ రామాచారి జెండా ఊపి బస్సును ప్రారంభించారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, మైసూర్ ప్రాంతీయ విద్యా సంస్థలను సందర్శించేందుకు 43 మంది ప్రధానోపాధ్యాయుల బృందం బయలుదేరినట్లు తెలిపారు.

సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆంగ్ల భాషా బోధన, సామర్థ్యాభివృద్ధిపై నాలుగు రోజుల పాటు ఈ ప్రత్యేక శిక్షణ ఉంటుందన్నారు. హెచ్‌ఎంలు ఇక్కడ నేర్చుకున్న అంశాలపై తోటి ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తూ, విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను మెరుగుపరచడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda