Chityala: హైదరాబాద్-విజయవాడ హైవేపై 5 కార్లు ఢీ: తప్పిన ప్రాణనష్టం!
Chityala: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల గుండ్రంపల్లి స్టేజి వద్ద 5 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు.
Chityala: హైదరాబాద్-విజయవాడ హైవేపై 5 కార్లు ఢీ: తప్పిన ప్రాణనష్టం!
నల్గొండ జిల్లా: చిట్యాల మండలం గుండ్రంపల్లి స్టేజి వద్ద 65వ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది.హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై ముందుగా వెళ్తున్న ఎమ్‌జీ గ్లోస్టర్ (MG Gloster) కారు డ్రైవర్ అకస్మాత్తుగా సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుక వస్తున్న కార్లు వేగాన్ని నియంత్రించలేక ఒకదానికొకటి వరుసగా ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో మొత్తం ఐదు కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే, ప్రమాద సమయంలో కార్లలో ఉన్న ప్రయాణికులందరికీ పెద్ద ముప్పు తప్పింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని రహదారిపై ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




