Nakrekal: వ్యక్తిగత దూషణలు శాంతిభద్రతలకు విఘాతం: డాక్టర్ వెంకటేశ్వర్లు

Nakrekal: నకిరేకల్‌లో తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ సభ్యులు డాక్టర్ వర్రి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వ్యక్తిగత దూషణలు శాంతిభద్రతలకు విఘాతమని పేర్కొన్నారు.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 6 Nov 2026 4:18 PM IST
Nakrekal
X

Nakrekal: వ్యక్తిగత దూషణలు శాంతిభద్రతలకు విఘాతం: డాక్టర్ వెంకటేశ్వర్లు

నకరేకల్: నకరేకల్ పట్టణ కేంద్రం ఓ ప్రవేట్ కార్యక్రమానికి వెళుతూ నకిరేకల్ లో ఆగి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన. తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ సభ్యులు డాక్టర్ వర్రి వెంకటేశ్వర్లు.

ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ... గొప్ప వ్యక్తుల పట్ల వ్యక్తిగత దూషణలు శాంతిభద్రతలకు విఘాతాలను కలిగిస్తాయనీ వాటి పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమాజంలో ప్రజల మధ్య కులాలు మతాల పేరుతో వైశ్యామ్యాలు సమాజానికి హానికరం అన్నారు.

ఇవి దేశ ఐక్యతను దేశ ప్రగతిని దేశ ప్రజాస్వామ్య పరి రక్షణను అడ్డంకులుగా మారుతాయి. యువత ఈనాడు పక్కదారి పట్టకుండా అవినీతి నిర్మూలనకు యువత కృషి చేయాల్సిందిగా ఎంతో అవసరం ఉందన్నారు.

చట్టాలు ప్రజలకు చాలా హక్కులను కల్పిస్తున్నాయని పరిపాలనలో పారదర్శకత ఉండాలని అధికారులు జవాబుదారులుగా ఉంచి అవినీతిని నిర్మూలించాలని ఎన్నో చట్టాలను ఈ దేశం ఈ రాష్ట్రం తీసుకురావడం జరిగిందన్నారు.

ఇటువంటి చట్టాలు ప్రజల్లోకి వెళ్లడం లో చాలా జాప్యం జరుగుతుందన్నారు. చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించినట్లయితే అవినీతిని చాలావరకు నిర్మూలించవచ్చు అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పరిపాలనను పారదర్శకంగా పరిపాలిస్తుందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కమిషన్ గాని హ్యూమన్ రైట్స్ కమిషన్ గాని లోకాయుక్త గాని ఎస్సీ బీసీ కమిషన్ గాని మహిళా కమిషన్ల ద్వారా ప్రజలకు న్యాయం చేయాలన్నారు.

పోలీస్ కంప్లైంట్ అథారిటీ 2006లో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీటన్నిటి పట్ల ప్రజలందరికీ అవగాహన ఉండేటట్లుగా ఎన్జీవోలు విద్యావేత్తలు కూడా భాగస్వామ్యం కావాలన్నారు.

ప్రభుత్వం నిర్ణయించే ప్రతి కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేసే బాధ్యత ప్రతి పౌరుల మీద ఉందని చెప్పారు.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL