Nalgonda: అన్నేపర్తి 12వ టీజీఎస్పీ బెటాలియన్‌లో ఘనంగా పండుగ సాయన్న జయంతి!

Nalgonda: నల్లగొండ జిల్లా అన్నేపర్తి 12వ టీజీఎస్పీ బెటాలియన్‌లో ఘనంగా పండుగ సాయన్న జయంతి. నివాళులర్పించిన కమాండెంట్ బి. రామకృష్ణ, అధికారులు.

Saleem, Nalgonda
Published on: 22 Oct 2026 1:10 PM IST
Nalgonda
X

Nalgonda: అన్నేపర్తి 12వ టీజీఎస్పీ బెటాలియన్‌లో ఘనంగా పండుగ సాయన్న జయంతి!

Nalgonda: అన్నేపర్తిలోని 12వ టీజీఎస్పీ బెటాలియన్‌లో ప్రజాపోరాట యోధుడు పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. బెటాలియన్ కమాండెంట్ బి.రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

​ఈ సందర్భంగా కమాండెంట్ ಮಾತలాడుతూ.. సమాజ శ్రేయస్సు కోసం, ప్రజల ఆత్మగౌరవం కోసం సాయన్న చూపిన ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శనీయమన్నారు. ప్రజాసేవలో ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని పిలుపునిచ్చారు.

​కార్యక్రమంలో అదనపు కమాండెంట్ ఎల్.నాగేశ్వరరావు, అసిస్టెంట్ కమాండెంట్లు నర్సింగ్ వెంకన్న, కె.మహేందర్, ఏఓ దయాకర్, వైద్యధికారులు షర్మిలాదేవి, నితిన్ గౌతమ్, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, బెటాలియన్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda